
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు అడుకుంటున్న చిన్నారి పాలిట పారిశుద్ధ్య ట్రాక్టర్ శాపమై చిదిమే సింది. ఈ హృదయ విదారక ఘటన మహాదేవ్ పూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన జనగాం శ్రావణ్ కుమారుడు పారిశుద్ద ట్రాక్టర్ వెనక టైర్ కింద పడి మృత్యువాత పడ్డాడు… స్థానికుల కథనం ప్రకారం మంగళవారం ఉదయం ఆరుబయట క్రీడాల్లో నిమజ్ఞామై ఆడుకుంటున్న బాలుడిని (2) పారిశుద్ధ ట్రాక్టర్ డీ కొనడంతో తలకు తీవ్ర గాయం అయింది దీంతో బాలుడిని మహాదేవ్ పూర్ సామాజిక హాస్పిటల్ కు తరలించారు కానీ ఫలితం లేకుండా పోయింది. బాలుడి మృతితో గ్రామంలో విద్యార్థి విషాద ఛాయలు అల్లుకున్నాయి.