
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీసీల 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నేడు తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ ఉధృతంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సు డిపోల వద్ద అడ్డంగా కూర్చుని బస్సులు ఎటు నడవకుండా అడ్డుపడుతున్నారు. ఈ బీసీల బంద్ ఉధృతంగా కొనసాగుతుందని ముందే తెలిసినటువంటి కొంతమంది షాపు యజమానులు కూడా దుకాణాలు బంద్ చేసి ఇంటి వద్దనే కూర్చున్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి, సిపిఐ అలాగే సిపిఎం సహా ఇతర పార్టీల నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బంద్ లో పాల్గొంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
Read also : హైదరాబాద్ లో తప్పని సిఎన్జి కష్టాలు.. క్రైమ్ మిర్రర్ నిఘాకి చిక్కిన బంకు యజమానుల చేతివాటం
Read also : బీటలు వారిన సీసీ రోడ్లు… అసంపూర్తిగా నిర్మాణ పనులు