Hyderabad Crime News: హైదరాబాద్లో ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉదయం కోఠి లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా..
ఎస్బీఐ ఏటీఎంలో రూ.6లక్షలు డిపాజిట్ చేసేందుకు ఈ రోజు ఉదయం రషీద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి.. ఆ నగదు మొత్తం తీసుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిందితుల కోసం పోలీసుల వేట
ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాలను స్థానికులని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుంగడుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.





