
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
RSS చీఫ్ మోహన్ భగవత్ హిందువులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదు అని అన్నారు. మనదేశంలో ఉన్నంతమంది హిందువులు ఏ దేశంలో లేరు అని.. అసలు మిగతా దేశాల్లో హిందువులు ఉన్నారో లేదో కూడా తెలియదు అని అన్నారు. మనదేశంలో 90 శాతం హిందువులే ఉన్నాం కాబట్టి మన నాగరికతలు ఇంకా మిగిలి ఉన్నాయి అని అన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూస్తుంది అని అన్నారు. ప్రతి దేశంలోని నాగరికతలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి కానీ
… మన భారతదేశంలోని నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడ ఉన్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు పేర్కొన్నారు. మన భారతదేశమంటేనే అంతం లేని నాగరికతకు పేరు అని.. మనదేశంలో హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోని హిందువులు ఎవరిపై ఆధారపడకూడదని అన్నారు. ప్రస్తుతం యునాన్(గ్రీస్ ), మిస్రు ( ఈజిప్ట్), రూమ్ సహా అన్ని దేశాలలో నాగరికతలు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పుకొచ్చారు. కానీ మన భారతదేశం అన్ని దేశాలకు భిన్నంగా ఉండడమే కాకుండా మనదేశంలో నాగరికత అనే గొప్పతనం మిగిలి ఉంది అని పేర్కొన్నారు. కాబట్టి మన దేశాన్ని మన హిందువుల మే కాపాడుకోవాలి.. ఎవరో వచ్చి మనల్ని బాగు చేస్తారంటే కుదరదు అని అన్నారు. ప్రతి రోజు, ప్రతిపూట, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా హిందువులు ఐక్యంగా ఉండాలి అని తెలిపారు.
Read also : త్వరలో ఏపీ లోనూ సర్పంచ్ ఎన్నికల సన్నహాలు!
Read also : ఈనెల 26వ తేదీ నుంచి శుభకార్యాలు చేయొద్దు : వేద పండితులు





