
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా కొన్ని ఆంక్షలు అయితే అధికారులు విధించడం జరిగింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 50 వేల రూపాయలు కంటే మించి నగదు తీసుకు వెళ్తే సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అలా చూపించలేదు అంటే ఆ డబ్బు మొత్తాన్ని కూడా సీజ్ చేస్తామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర లేకపోతే.. పోలీసులు ఆ డబ్బును హోల్డ్ లో పెడతారు. మనం తరువాత ఆ డబ్బుకు సంబంధించి పత్రాలు సమర్పించిన మన డబ్బును మనకి తిరిగి ఇస్తారు. అలా చేయకపోతే వెంటనే మన డబ్బును సీజ్ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాబట్టి 50 వేల రూపాయలకు మించి డబ్బులు ఎక్కడికైనా తీసుకువెళ్లాలి అంటే కచ్చితంగా వాటికి సంబంధించిన పత్రాలు ఉండాలని ఎన్నికల కోడ్ సంఘం అధికారులు ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా మరోవైపు సామాన్య ప్రజలు ఈ రూల్స్ పై మండిపడుతున్నారు. అత్యవసర పరిస్థితులలో చాలామంది ప్రజలు ఈ రూల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఫైర్ అవుతున్నారు.
Read also : ఎన్నికలకు దూరంగా మంగపేట మండలం
Read also : గెలిచి 10 గంటలు అవుతుంది… ఇప్పటివరకు నో విషెస్?