జాతీయం

70 ఏళ్లుగా సహజీవనం.. 95 ఏళ్ల వయసులో పెళ్లి.. ఇదీ క్రేజీ అంటే!

Rajasthan Couple Live In Relationship:  వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. సహజీవనం చేశారు. పిల్లల్ని కూడా కన్నారు. వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. వారికి కూడా పిల్లలు పుట్టారు. అయితే ఏంటి అనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. కాటికి కాళ్లు చాపే వేళ్ల మూడు ముళ్ల బంధంతో ఒక్కయ్యారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఇంతకీ వాళ్లు ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే..

70 ఏళ్లుగా సహజీవనం

రాజస్థాన్ లోని దుంగార్‌ పూర్ జిల్లా గలందర్‌ కు చెందిన రమాభాయ్ ఖరారి 25 ఏళ్లు, జీవాలి దేవి 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు. సుమారు 70 ఏళ్లకుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కూడా కనేశారు. ఆ పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. వారికి కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు వారి వయసు ఖరారి వయసు 95 ఏళ్లు కాగా, దేవి వయసు 90 ఏళ్లు.

చనిపోయే ముందు భార్య భర్తలుగా పోవాలని!

ఈ వయసులో ఆ వృద్ధ ప్రేమికులు ఓ నిర్ణయం తీసుకున్నారు. కనీసం చనిపోయే సమయంలోనైనా భార్యభర్తలు కావాలనుకున్నారు. చనిపోయేటప్పుడు భార్యభర్తలుగా పోవాలనకున్నారు. ఇదే విషయాన్ని తమ పిల్లలకు చెప్పారు. వాళ్లు కూడా సరే అన్నారు. ఊరి పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పారు. వారు కూడా మంచి నిర్ణయమే అన్నారు. అందరూ కలిసి మంచి ముహూర్తం చేశారు. జూన్ 1న పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. డీజే పెట్టి గ్రామంలోని ప్రజలంతా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. జూన్ 4న ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వృద్ధ ప్రేమికులు వివాహవేడుక ఆ ఊళ్లో పండుగ వాతావరణాన్ని నింపింది. ప్రస్తుతం వీరి పెళ్లి వ్యవహారం ఇప్పుడు రాజస్థాన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: బరాత్ లో డీజే లొల్లి.. పెళ్లి కొడుకును కొట్టి చంపడమేంట్రా?

Back to top button