
క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- గ్రామ అభివృద్ధి జరగాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేసి మట్ట యాదమ్మ,వెంకటయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వెల్దండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ కోరారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గురువారం వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెల్డండ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రామ ప్రజల సహకారం సూచనలతో ముందుకు వెళ్లి రాష్ట్రంలోనే వెల్డండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
Read also : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!.. సరైన నాయకుడిని ఎన్నుకోండి?
Read also : Voter Id: ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ ఫోన్‌లోనే ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ చేసుకోండి!





