రాజకీయం

త్వరలోనే ఢిల్లీలో ఎన్నికలు!… పోలింగ్ ఎప్పుడంటే?

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 5న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 10న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వివరించింది. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 18న నామినేషన్ల పరిశీలన(స్ర్కూటినీ) ఉంటుంది.

Read More : మా సారు మాకే కావాలి!.. పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థులు?

20వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 5న పోలింగ్‌ను నిర్వహిస్తామని, 8న కౌంటింగ్‌, ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఢిల్లీలో 2 లక్షల మంది కొత్త ఓటర్లను కలుపుకొని 1.55 కోట్ల మంది ఓటర్లున్నట్లు ఈసీఐ వెల్లడించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 12 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్‌ క్యాటగిరీలో ఉన్నాయి. ‘‘ఢిల్లీలో మోడల్‌ కోడ్‌(ఎన్నికల నియమావళి) అమల్లోకి వచ్చింది.

Read More : హైకోర్టులో KTRకు ఊరట

85 ఏళ్లకు పైగా వయసున్న ఓటర్లకు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం అని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ‘‘పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధం కండి’’ అని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ‘ఫిర్‌ లాయింగే కేజ్రీవాల్‌(కేజ్రీవాల్‌ను మళ్లీ తీసుకొస్తాం)’ అనే పాటను తమ ప్రచార గీతంగా ఆప్‌ ప్రకటించింది.

Read More : రేవంత్ పెట్టే లొట్ట పీసు కేసులకు నేను భయపడను: కేటీఆర్

Back to top button