
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించగా మెల్లిమెల్లిగా ప్రజలు ఈ తుఫాన్ నుంచి కోలుకుంటున్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు మరో చేదువార్తను తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా వీస్తున్నటువంటి గాలులకు రాష్ట్రంలో వచ్చే రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరీ ముఖ్యంగా నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని APSDMA అధికారులు వెల్లడించారు. మరోవైపు కృష్ణ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుఫాన్ పూర్తిగా వైదొలిగినప్పటికీ రాష్ట్రంలో కొద్దిరోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉంటాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోను కూడా పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
Read also : జోగి రమేష్ అరెస్ట్ అవుతారా..?
Read also : వైసీపీ ఒక ఫేక్ పార్టీ.. ఎప్పుడు చూసినా శవరాజకీయాలే : సీఎం చంద్రబాబు





