
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్స్లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ను ఏపీకి తరలిస్తున్నారు.
పోసాని కృష్ణ మురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు .. 196, 353(2), 111 25 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నేపథ్యంలో బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై.. రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు.
గురువారం ఉదయానికి ఓబులవారిపల్లెకు తరలించే అవకాశముంది. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరు పరిచే అవకాశముంది. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం