సినిమా

మా ఇద్దరిదీ ఒకే రాశి.. అందుకే వైబ్ కుదిరింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ బోర్సే ఇద్దరూ కూడా కలిసి నటిస్తున్నటువంటి సినిమా “ఆంధ్ర కింగ్”. ఈ సినిమా ఈనెల 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఆంధ్ర కింగ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎవరు కూడా ఊహించనటువంటి విధంగా డ్రోన్లతో సరికొత్తగా ప్రారంభించారు. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల రామ్ పోతినేని అభిమానులకు చాలానే ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. హీరో రామ్ పోతినేని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ పోతినేని అలాగే నేను ఒకే రాశిలో పుట్టామంటూ… మన హీరో రామ్ తో ఈ సినిమాలో అందుకే వైబ్ బాగా కుదిరింది అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మా ఇద్దరి రాశి వృషభ రాశి అని పండితులు చెప్పారని అన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో నటిగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని ఆమె అన్నారు. ఇక కాంత మూవీలో రోల్ అనేది చాలెంజ్ గా అనిపించింది అని అన్నారు. ఇక షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతోనే తన జీవితాన్ని గడుపుతాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక బోర్ అనిపించిన సమయంలో మొబైల్ స్విచాఫ్ చేసి వెంటనే ట్రిక్కింగ్ కు వెళ్తాను అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Read also : రైతులకు గుడ్ న్యూస్… తడిసిన ధాన్యం కూడా కొనుగోళ్లు!

Read also : ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత చికిత్స.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button