అంతర్జాతీయంజాతీయం

విజృంభిస్తున్న కోవిడ్ – దేశంలో 257 కేసులు, ఇద్దరి మృతి!

క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ : కోవిడ్ మళ్లీ చెరగని గుదిబండలా కనిపిస్తోంది. 2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి, ప్రస్తుతం మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

దురదృష్టవశాత్తూ, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు మరియు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న 59 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇరువురికీ కోవిడ్ టెస్ట్ చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ పరిణామాలతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు మాస్క్‌లు ధరించటం, భౌతిక దూరం పాటించడం, సానిటైజర్లు ఉపయోగించడం, మరియు అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి సూచనలు ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Back to top button