ఆంధ్ర ప్రదేశ్

మూడేళ్లు కళ్లు మూసుకోండి.. ఆపై రాజ్యం వైసీపీదే - జగన్‌కు అంత ధీమా ఏంటో..?

రాబోయేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న ధీమాలో ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌. మూడేళ్లు కళ్లు మూసుకోండి చాలు.. అఖండ మెజార్టీతో మళ్లీ పవర్‌లోకి వస్తామని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. జగన్‌ 2.0లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చారు. అయితే అది కాన్ఫిడెన్సా…? ఓవర్‌ కాన్ఫిడెన్ఫా…?

ఏపీలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉపఎన్నికలు జరిగితే 39 స్థానాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుందని చెప్పారు. ఈ స్థానిక సంస్థల ఉపఎన్నికలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ నింపాయి. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా… మెజారిటీ స్థానాలను వైసీపీ కైవశం చేసుకుంది. దీంతో… ఉపఎన్నికల్లో గెలిచిన ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులను పిలిచి అభినందన సభ పెట్టారు వైఎస్‌ జగన్‌. అధికార పార్టీ ప్రలోభావాలు, అక్రమాలు, అన్యాయాలకు తలొగ్గకుండా… నిలబడిన వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వారి తెగవును కొనియాడారు జగన్‌. అధికార పార్టీ తీరుతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు.. వైసీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జగన్‌.


Also Read : బుగ్గన, రోజాకు వైఎస్‌ జగన్‌ క్లాస్‌ – తప్పు రిపీట్‌ చేయొద్దంటూ వార్నింగ్‌..!


సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు… ఎంపీపీ వంటి చిన్న పదవుల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని… దీన్ని ప్రజలంతా గమనించారన్నారు. అంతేకాదు… సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగరగొట్టేసి… రెడ్‌బుక్‌ పేరుతో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. హామీల గురించి ప్రశ్నిస్తుంటే.. పీ-4 పేరుతో మరో మోసానికి తెరతీశారన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని రేషన్‌ కార్డులు ఉన్నాయి… ఎంత మంది ట్యాక్స్‌ పేయర్లు ఉన్నారో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు జగన్‌. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయిందని…. ఇక మూడేళ్లు గట్టిగా కళ్లు మూసుకుంటే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయని అన్నారు జగన్‌. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పారాయన. జగన్‌ 2.0 వేరుగా ఉంటుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏ విధంగా అండగా నిలబడతానో అందరికీ చూపిస్తానని అన్నారు. మొత్తంగా… 2029 ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్న జగన్‌. మరి.. ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టి.. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే.. ఆయన ఆశ నెరవేరుతుందేమో..!

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Back to top button