తెలంగాణ

ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుంది..- ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు

క్రైమ్ మిర్రర్, చండూరు :- ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 25 వ తేదీ ఆదివారం నాడు నల్గొండ జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగాయి. కాగా ఈ పోటీలలో చండూరు మండల కేంద్రానికి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొని, ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థుల్లో టి. వేదాన్షి ఒకటవ తరగతి, కె. రిత్విక్ ఏడవ తరగతి, ఎం మధు శ్రీ 8 వ తరగతి విద్యార్థులు బంగారు పతకాలను, ఎం ఉదిత్ వెండి పతకం ను సాధించారు. కాగా తైక్వాండో పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులను బుధవారం డాక్టర్ కోడి శ్రీనివాసులు మెడల్స్ తో పాటు ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వలన విద్యార్థుల్లో ఆత్మరక్షణ పెరగడంతో పాటు, మనోధైర్యం పెంపొందుతుందని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పథకాలను సాధించి, పుట్టిన ఊరుకు, చదువుకున్న పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మ రక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ట్రైనర్ రమేష్, వెంకటేశ్వర్లు, యాదయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

<a href=”https://crimemirror.com/farmers-should-not-be-fooled-by-trusting-middlemen-aeo-narasimha-goud/”>దళారులను నమ్మి మోసపోవద్దు రైతులు..ఏఈవో నరసింహ గౌడ్

కారు ప్రమాదంలో గాయపడ్డ వైయస్ఆర్‌సీపీ నేత కొండా రాజీవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button