క్రైమ్తెలంగాణ

దళిత యువకుడు రాజేశ్ మరణంపై విచారణకు హైకోర్టు జడ్జి అవసరం: మందకృష్ణ మాదిగ

దళిత యువకుడు రాజేష్‌ను పోలీసులు ఆకారణంగా హత్య చేశారు

హైదరాబాద్‌, క్రైమ్ మిర్రర్: దళిత యువకుడు రాజేష్‌ను పోలీసులు ఆకారణంగా హత్య చేశారంటూ ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాల్సిందే అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కేసులో బాధ్యులైన అధికారులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరారు.

స్థానిక ఎన్నికల సమయంలో జిల్లా ఎస్పీ తప్పు చేసిన అధికారులను కాపాడుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంలో ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందం హస్తక్షేపం చేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

అంతర్గత విచారణ పేరుతో ఘటనను దాచిపెట్టే ప్రయత్నాలు మళ్లీ దళితులపై అన్యాయం జరగకుండా చర్యలు కోరుతున్నామని మందకృష్ణ స్పష్టం చేశారు. రాజేష్ మరణంపై నిరసనలు, స్పందనలు కొనసాగుతున్న నేపథ్యంలో అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Back to top button