సంక్రాంతి పండగ వేళ సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భర్తను కట్టుకున్న భార్యలే కడతేర్చారు. రోకలి బండతో కొత్తి దారుణంగా చంపేశారు. భర్తను రోకలి బండతో కొట్టి చంపారు ఇద్దరు భార్యలు.సూర్యాపేట – చివ్వెంల మండలం గుర్రంతండాలో ఈ ఘటన జరిగింది.
ఆదివారం అర్ధరాత్రి భర్తను రోకలి బండతో కొట్టి చంపారు ఇద్దరు భార్యలు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని.. మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.