
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తాజాగాదేశంలో బలవన్మరణాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021 లో దాదాపుగా 13 వేల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నట్లుగా పేర్కొనడంతో… ఈ విషయం ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా తెగ వైరల్ అవుతుంది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
లేడీ అఘోరీతో బీటెక్ యువతి జంప్… కామ వాంఛ తీర్చుకోలేదన్న శ్రీ వర్షిణి
మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఏడాది కొన్ని వందలలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ప్రతిరోజు మనం సోషల్ మీడియాలోనూ లేదా వార్తలు లోను చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీటిపై ఉన్నతాధికారులు సమీక్షలు జరిపి విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలాగైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకప్పుడు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని కానీ ఇప్పుడు పూర్తిగా విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. మన దేశానికి రైతులు అలాగే యువకులు చాలా ముఖ్యం అని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఒకవైపు రైతులు మరోవైపు విద్యార్థులు ఎక్కువగా కొన్ని ఒత్తిడి కారణాల వల్ల అలాగే ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయనీ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఈ ఆత్మహత్యలు జరగకుండా చర్చలు జరిపి వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
వర్కాల సూర్యనారాయణను సన్మానించిన గ్లోబల్ బిజినెస్ నెట్‌వర్క్!.