
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీధి కుక్కల సమస్యలు ఎక్కువవుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుత కాలంలో వీధి కుక్కలు రోడ్లపైకి వచ్చి ప్రజలను కరిచి గాయపడేటట్టు చేయడం లేదా ఇబ్బందులు పెడుతున్న కారణంగా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. స్కూల్స్, రైల్వే స్టేషన్స్, ఆసుపత్రులు వంటి జవాసాల్లోకి కుక్కలు రానివ్వకుండా ఎనిమిది వారాల్లోపు వీటన్నిటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే మరియు ఎక్స్ప్రెస్ హైవే ల పైకి మూగజీవాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని స్పష్టం చేశారు. ఇంకోవైపు పబ్లిక్ ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాల్లోకి స్ట్రే డాగ్స్ రానివ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అమికాస్ క్యూరీ దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని వెల్లడించింది. వెంటనే వీటిపై ఆఫడవిట్ వేయాలని.. లేదంటే ఆయా రాష్ట్రాలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా కొన్ని నెలల క్రితం ప్రముఖ నగరాలలో వీధి కుక్కలు అన్యం పుణ్యం తెలియని పసి పిల్లలపై దాడులు చేయడం ద్వారా ఎంతోమంది మరణించారు. ఎంతోమందికి రేబిస్ వ్యాధి సోకి ఆసుపత్రిలో ఇప్పటికి కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఇందుమూలంగానే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై లోతైన విచారణ చేసి నేడు ఇటువంటి ఆదేశాలను జారీ చేసింది.
Read also :బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం!
Read also : వరల్డ్ కప్ విజేతలకు సూపర్ న్యూస్.. జట్టులోని ప్రతి మహిళకి టాటా కార్లు గిఫ్ట్!





