Tuesday, February 17, 2026
HomeజాతీయంSabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

Sabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం విచారణ
  • విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం ఏర్పాటు
  • ఏప్రిల్ 7 నుంచి విచారణ

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ చేపట్టనుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది. అన్ని వయస్సుల వారికి ప్రవేశం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ అంశాన్ని విస్తృత ధర్మాససానికి అప్పగించేందుకు 2020 ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత పార్టీలు తమ వాదనలను మార్చి 14 లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విచారణ

తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల సమీక్ష కేసుపై ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విచారణ జరుపుతుంది. ఏప్రిల్ 22 వరకూ రెండు వారాల పాటు విచారణకు సమయం కేటాయిస్తున్నాం. రివ్యూ పిటిషనర్లు, వారికి సపోర్ట్ చేసే పార్టీ వాదనలను ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 9 వరకూ విచారిస్తుంది. రివ్యూను వ్యతిరేకించే వారి పిటిషన్లను ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకూ వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. రిజాయిండర్ సబ్మిషన్లు ఉంటే ఏప్రిల్ 21న వింటామని వెల్లడించింది.

సమీక్షకు సపోర్టు చేసిన కేంద్రం

అటు పిటిషన్లపై సమీక్షకు తాము మద్దతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే కోర్టుకు సమర్పించిన వివరాలను వెల్లడించలేమని సీపీఎం తెలిపింది.

Read Also: కారులో కుక్కతో పార్లమెంట్ కు.. ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్‌ నోటీసు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments