
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలపై మరోసారి స్పష్టతనిచ్చారు. తాజాగా నేడు తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల లో జరిగినటువంటి “రైతన్న మీకోసం” కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో.. అవన్నీ కూడా అబద్ధమే అని.. విద్యుత్ చార్జీలను ఎప్పుడు కూడా పెంచేది లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చార్జీలు పెంచకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో కృష్ణ మరియు గోదావరి నదులను అనుసంధానం చేసి ఆ నీటిని పెన్నా వరకు కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఇక ఏ అవసరం ఉన్నా కూడా కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆలోచించి మరి వాట్సప్ సేవలు ప్రారంభించాము అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఇక సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి అని తెలిపారు. గత ప్రభుత్వంలో కన్నా ఇప్పటి ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అని వ్యక్తం చేశారు.
Read also : హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్సై సంజయ్ సావంత్ మృతి..!
Read also : నావల్ల కావట్లేదు అంటూ నాన్నకు ఫోన్ చేసిన 22 ఏళ్ల అమ్మాయి.. చివరికి నాన్న ఏం చేశారంటే?





