
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమికి తిరిగి రాబోతున్నారు. వారు స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో సముద్రంలో దిగుతారు. మిషన్ ముగిసిన తర్వాత క్యాప్సూల్ తెరిచినప్పుడు, ఇద్దరు వ్యోమగాములను నేరుగా స్ట్రెచర్‌పై తీసుకువస్తారు. నెలల తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత వ్యోమగాములు అకస్మాత్తుగా నడవలేరు. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇవి సమతుల్యత, కండరాలను ప్రభావితం చేస్తాయి.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు, భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది.నాసా టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు.
వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ ఇప్పుడు తిరిగి రానున్నారు. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను రంగంలోకి దించారు.మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్‌లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్‌లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్‌లో జీఎస్-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 1 కోటీ 8లక్షల నుంచి 1 కోటీ 41 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.పరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్‌లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్‌లకు నాసా 81 లక్షల నుంచి కోటి వరకు చెల్లించే అవకాశం ఉంది.