
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై భారత్ ఘనవిజయం సాధించింది. 339 పురుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించారు. మ్యాచ్ ప్రారంభం కు ముందు ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రేలియన్ గెలుస్తుంది అని భావించగా.. ఆ తరువాత వారి అంచనాలను తారుమారు చేస్తూ జెమ్మి రాడ్రిక్స్ సూపర్ సెంచరీ తో ఇండియాకు విజయాన్ని అందించి ఫైనల్ కు తీసుకు వెళ్లేలా చేసింది. దీంతో నవంబర్ రెండవ తేదీన ఆదివారం భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మహిళల జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా ఒక చరిత్ర సృష్టించారు అనే చెప్పవచ్చు. ముంబై వేదికగా నవంబర్ రెండవ తేదీన మధ్యాహ్నం ఫైనల్ పోరు జరగనుంది.
Read also : ప్రతి నెలా.. ప్రతి నియోజకవర్గంలో.. జాబ్ మేళాలు నిర్వహించాలి : సీఎం చంద్రబాబు
భారత్ మరియు సౌత్ ఆఫ్రికా జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన చరిత్ర లేదు. కాబట్టి ఈసారి ఎవరు గెలిచినా కూడా ఆ జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ దక్కించుకొని చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ లో ఇండియా పై విజయం సాధించి ట్రోఫీ గెలవాలన్న కసితో ఉండగా.. ఎన్నోసార్లు వరల్డ్ కప్ లో ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియాపై గెలిచిన జోష్ లో టీమిండియా ఉంది. దీంతో ఒకవైపు సౌత్ ఆఫ్రికా మరోవైపు టీమ్ ఇండియాకు ఈ ఫైనల్ మ్యాచ్ అనేది చాలా కీలకం కానుంది. ఆస్ట్రేలియాపై గెలిచిన టీమ్ ఇండియా ఇదే జోష్తో సౌత్ ఆఫ్రికా పై ఆదివారం జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలి అని ఇండియన్ అభిమానులు కోరుతున్నారు. మరి ఫైనల్ జరగబోయేటువంటి మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అనేది కామెంట్ చేయండి.
Read also : నేడే రెండో టీ20.. మ్యాచ్ జరగడం కష్టమే?
 
				 
					
 
						 
						




