హత్నూర క్రైమ్ మిర్రర్ ప్రతినిధి డిసెంబర్ 29 : వ్యక్తి గత కారణలతొ ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ స్టేషన్ వెనుకాల గల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు గత రాత్రి చోటుకుంది.
గుంటూరుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ కొన్నేళ్ల క్రితం జోగిపేట్ కి చెందిన లక్ష్మి తొ వివాహం జరిగింది. అయితే అప్పటి నుండి వారు నర్సాపూర్ లొ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ నర్సాపూర్ లోని ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరణానికి కారణం మహిళతో వివాహేతర సంబంధం అయిఉండవచ్చని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.