క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి): ములుగు జిల్లాలోని ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్ రిసార్టులో వాజేడు ఎస్సై హరీష్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగతజీవి గా ఉన్న హరీష్ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంఘటన ఎలా జరిగింది..? ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు.
ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమపేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి, ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్సై హరీష్ కు ఫోన్‌లో కాంటాక్ట్ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని, అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీష్ నిరాకరించాడని, ఈ క్రమంలోనే హరీష్ కుటుంబసభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకీడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీష్ ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరువుపోతుందోననే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఎస్సై హరీష్ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను నిగ్గుతేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా, ఆ యువతిని సోమవారం సాయంత్రమే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా ఇచ్చి దూద్యా తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుశాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబసభ్యులను, సన్నిహితులను తీవ్రంగా కలచివేస్తోంది.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్