
-పలివేలలో సైబర్ నేరాలపై విద్యార్దులకు అవగాహన
-నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-విద్యార్థులు మొబైల్ ఎక్కువ వాడకూడదు
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- సైబర్ నేరగాళ్ల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మునుగోడు ఎస్సై ఇరుగు రవి కుమార్ అన్నారు. మండలములోని పలివేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాస్ అధ్యక్షతన సైబర్ నేరాలపై నిర్వహించిన కార్యక్రమములో మునుగోడు ఎస్సై ఇరుగు రవి కుమార్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మొద్దని,వాటిని అరికట్టేందుకు సహకరించాలని సూచించారు. విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాలపై ఎంతోకొంత అవగాహన కలిగివుండాలి అన్నారు. విద్యార్దులు ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల చెడిపోవడం జరుగుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ వాడకుండా చూడాలని,చెడు వ్యసనాలకి అలవాటు పడకుండా క్రమశిక్షణతో విద్యపై దృష్టిపెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
Read also: పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఊస్టింగే.. మంత్రులకు చంద్రబాబు వార్నింగ్!
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్ కి సమాచారం ఇచ్చి ఎన్ సీ ఆర్ పి పోర్టల్ నుండి www .cybercrime.gov.in లో పిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ స్పందించి ,సహకరించి పోయిన డబ్బులు రికవరి చేసుకోవడానికి సహకరిస్తారని తెలిపారు.ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు రఫీ, పెరిక నరసింహ,ఉయ్యాల యాదయ్య,దత్తేశ్వర్,వెంకటేశ్వర్లు,విలియం రాజ్, లక్ష్మీనరసయ్య , గెర నరసింహ, బాలరాజు,లింగమ్మ,వెంకన్న,రాఘవేందర్, మహేష్,పోలీసు సిబ్బంది విద్యార్దులు పాల్గొన్నారు.
Read also : రాజకీయాలు వదలడం ఇష్టంలేదు.. ఉపరాష్ట్రపతిని చేసిన రోజు ఏడ్చేశా..!