క్రైమ్ మిర్రర్,వికారాబాద్ : అక్కడక్కడా నిబంధనలు పాటించని పలువురు ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం చూస్తుంటాం కానీ…విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే పరిమితికి మించి ఆటోలో విద్యార్థులను ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ముందు సోమవారం కంటపడింది.ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read More : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తాము అంటూ బెదిరింపులు?
నవాబ్ పేట్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో సోమవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ ఆటల కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల నుండి విద్యార్థులను తీసుకోని ఉపాధ్యాయులు వచ్చారు.ఇంత వరకు బాగానే ఉన్న కానీ తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదమని తెలిసిన కూడా ఒకే ఆటోలో పరిమితికి మించి సుమారు (17) మంది విద్యార్థులను దగ్గరుండి ఎక్కించి ఇంటికి ఉపాధ్యాయులు ప్రభు,విజయ్ కుమార్ పంపించారు.ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే..బాధ్యత ఎవ్వరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ వీళ్ళు బడి పంతుల్లేనా..?
పరిజ్ఞానవంతమైన ఉపాధ్యాయులే పుష్పక విమానంలో ఎక్కించినట్లు పరిమితికి మించి ఓ ఆటోలో విద్యార్థులను ఎక్కించి ఇంటికి పంపించారు. బ్రతుకుతెరువు కోసం ఆటో నడుపుకొని జీవించే ఆటో డ్రైవర్ ఇలా చేస్తే పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుంటే విమర్శించే ఉపాధ్యాయులే,అది ప్రమాదం అని తెలిసి కూడా కనీసం విద్యార్థులకు భద్రత ఉందా లేదా అని ఆలోచించకుండా సుమారు 17 మంది విద్యార్థులను ఒకే ఆటోలో ఎక్కించి, వెనకాల వేలాడించి వారింటికి పంపే ప్రయత్నం చేశారు. ఈ ఆటోలో ఇలా వేలాడుతూ ఇంటికి వెళ్తున్న విద్యార్థులను చూసిన వాహనదారులు,పరిసర ప్రాంతం వాళ్లు ఉపాధ్యాయులపై విమర్శలు చేశారు. మీరే ఇలా చేస్తే ఎలా అన్నట్లు వారిపై మండిపడుటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడి ఇలా భద్రత లేకుండా, ఉపాధ్యాయులను ఆటోలో కుక్కిన ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Read More : ఎర్రచందనం చెట్టుకు ఎందుకంత డిమాండ్!.. కిలో ఎంతంటే?