
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి:- నిరుపేదలకు కార్మికులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యం అని తద్వారా సమాజంలో మానవత్వం వెళ్లి విరుస్తుందని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నాడు శంకర్ పల్లి కి చెందిన కాంట్రాక్టర్ సుమన్ కుమారుడు విద్యార్థి జి.మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో, నిరుపేద గుడిసె వాసులకు, రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అభాగ్యులకు, కూలీలకు, మోకిలా తాండలోని కార్మికులకు, కర్షకులకు మొత్తం 400 మందికి అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ సంపాదనలో కొంత దానం చేయడం పేదలకు సహాయం చేసే దృక్పథం ప్రతి ఒక్కరిలో రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి తండ్రి సుమన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలన్నారు. అనంతరం విద్యార్థి మోక్షిత్ ను నిరుపేదలందరూ అభినందించి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జనరల్ సెక్రెటరీ వేనేంద్ర చారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్ కరాటే బ్లాక్ బెల్ట్ మరియు ప్రణీత్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఓనర్ దేవుల నాయక్, కృష్ణా, రమేష్, నరేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Read also : పైసా లేకున్నా నిజాయితీగా పోటీ.. చివరికి డబ్బున్నోడిదే రాజ్యం!
Read also : మోదీ – పుతిన్ భేటీ.. ట్రంప్ పై ట్రోల్స్?





