తెలంగాణ

లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది: సిఐటీయూ

జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు

లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది: సిఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు

కల్వకుర్తి, మే 20 (క్రైమ్ మిర్రర్):
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మిక హక్కులను తొలగించే ప్రయత్నాల్లో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తోందని, వాటిని తిప్పికొట్టేంత వరకు సిఐటీయూ పోరాటం కొనసాగిస్తుందని జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు హెచ్చరించారు.

మంగళవారం కల్వకుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. కార్మిక వర్గం సాధించిన 29 చట్టాలను రద్దు చేసి, వాటికి బదులుగా వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఫ్యాక్టరీ చట్టం, సామాజిక భద్రత కోడ్‌లను తీసుకువచ్చారని తెలిపారు.

పారిశ్రామిక సంబంధాల కోడ్ ముఖ్యమైనదిగా పేర్కొన్న ఆయన, 1926లో వచ్చిన ట్రేడ్ యూనియన్ చట్టం, 1946లో అమలైన స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం, 1947లో వచ్చిన పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రద్దు చేసి కొత్త కోడ్ తీసుకువచ్చారని వివరించారు. ఈ కోడ్‌లు అమలవుతే పర్మనెంట్ ఉద్యోగాల వ్యవస్థను తుల్లించేసి తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థ బలపడుతుందని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కార్మికులను ఆధునిక బానిసలుగా మలచే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ప్రస్తుత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ కార్మిక వర్గాన్ని బలహీనపరచే దిశగా సాగుతోందని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, మల్లేశ్, రాములు, లక్ష్మమ్మ, ఆశావర్కర్స్ యూనియన్ కల్వకుర్తి అధ్యక్షురాలు రఫీకా సుల్తానా, భాగ్యలక్ష్మి, శైలజ, స్వాతి, హసీనా, మజీమున్నీసా, సుభద్ర, మంజుల, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్రెడ్డి, ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ జగన్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు అలివేల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button