
క్రైమ్ మిర్రర్,పాలకీడు:- శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని మండల ఎస్ఐ కోటేష్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. పాలకవీడు మండల ప్రజలు ఎన్నికల సమయంలో గ్రామాలల్లో, వాట్సాప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియా వేదికలో ఒక వర్గం మీద మరొక వర్గం రెచ్చగొట్టే,ద్వేషపూరిత, వర్గ వైషమ్యాలకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు,పోస్టులు,వీడియో లు పెడితే… పెట్టిన వారి పై కఠినపరమైన చర్యలు తీసుకొనబడతాయనీ అన్నారు. అదే విధంగా వాట్సాప్ గ్రూప్లో రెచ్చగొట్టే విదంగా పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్ ల పై కూడా చర్యలు తీసుకొనబడతాయన్నారు. ఎన్నికల సమయం లో శాంతి భద్రతలకు పాలకవీడు మండల ప్రజలందరూ సహకరించగలరని ఈ సందర్భంగా కోరారు.
Read also : నేను రాజకీయాలకు అన్ ఫిట్ అయితే నువ్వేంటి మరి : హరీష్ రావు
Read also : రైతులను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నావా?.. చంద్రబాబుపై మండిపడ్డ జగన్!





