లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : డిఎంహెచ్ఓ రవికుమార్

నాగర్ కర్నూల్, క్రైమ్ మిర్రర్: గర్భ వతులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి అమ్మాయా, అబ్బాయా అని చెప్పినచో నిర్వాహకులపై మరియు వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె .రవికుమార్ తెలిపారు. శుక్రవారం నాడు కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్స్,హాస్పిటల్స్ ను డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలపై వివక్ష వలన కొందరు స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని అబార్షన్స్ చేయించుకోవడం వలన నాగర్ కర్నూల్ జిల్లాలో 1000 మంది అబ్బాయిలకు 894 అమ్మాయిలకు జన్మనిస్తున్నారని తెలిపారు. దీని వలన లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది. ప్రస్తుతం అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాలలో రాణిస్తున్నారు.కావున అమ్మాయిలపై వివక్ష తగదని తెలిపారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్స్ లో నిర్వహిస్తున్న స్కానింగ్ పరీక్షలను, రికార్డులను, ఫామ్ ఎఫ్ లను తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం బోర్డులను తప్పనిసరిగా స్కానింగ్ సెంటర్ లో ప్రదర్శించాలని వైద్యులకు తెలియజేశారు. లింగ నిదారణ పరీక్షలు చేసినవారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించుకున్న వారికి 3 మూడు సంవత్సరాల జైలు, 50,000 రూపాయల జరిమానా విధించబడును. స్కానింగ్ సెంటర్స్ ను నిబంధనల ప్రకారం నిర్వహించాలి, రేట్ల పట్టికను బయట ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మణ్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాల చారి ఇతర డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read also : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

Read also : ఊపిరి పీల్చుకున్న కోహ్లీ ఫ్యాన్స్.. “అన్న వచ్చేసాడోయ్ “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button