
క్రైమ్ మిర్రర్,మంగపేట:- యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని,అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై టీవీఆర్ సూరి శనివారం ప్రకటనలో తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని అన్నారు.సరదాగా మొదలైన బెట్టింగ్ వ్యసనంగా మారుతుందని యువత వీటికి దూరంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లితండ్రుల పై ఉందని అన్నారు.క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.మొబైల్ ఫోన్ లలో బెట్టింగ్ యాప్స్ ఉన్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాజకీయం గురించి మాట్లాడుతుంటే మీరేంట్రా OG… OG అంటారు: పవన్ కళ్యాణ్
తిరుమల దర్శనాల కోసం అడుక్కోవాల్సిన ఖర్మేంటి..? – టీటీడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్