
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-
మాదిరెడ్డిపల్లి రైతు పొలంలో చెట్టుపై పడ్డ పిడుగు…!
వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం…!
అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు…!
మబ్బులు కమ్మి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం శనివారం బీభత్సం సృష్టించింది.దింతో వికారాబాద్ జిల్లాల్లో తాండూర్, మోమిన్ పేట్ నవాబ్ పేట్,వికారాబాద్ మొదలైన ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.నవాబ్ పేట్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై చెట్టు విరిగిపడడంతో వాహనాలు కొద్దీ దూరం ఎక్కడికక్కడే ఆగిపోయాయి.చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ వెళ్లే రహదారి మార్గంలో చెట్టు విరిగిపడింది.వెంటనే అప్రమత్తమైన నవాబ్ పేట్ పోలీస్ అధికారులు స్థానికులతో కలిసి జేసీబీతో చెట్లను తొలగించిన తర్వాత రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.అదేవిదంగా మాదిరెడ్డి పల్లి గ్రామంలో పొలంలోని చెట్టుపై పిడుగు పడింది.పిడుగుపాటు సమయంలో పొలం దెగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.ఆర్కతల గ్రామంలో పెద్ద మొత్తంలో వడగండ్ల వాన పడడంతో గ్రామంలోని యువకులు పట్టుకొని సంతోషం వ్యక్తం చేశారు.మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వానకు మంగళి రమేష్ అనే రైతు రెండెకరాల మిరప పంట పూర్తిగా ద్వంసం అయ్యింది.వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడం వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.గత రెండు రోజులుగా ఎండ,ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో సేదదీరారు.