
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి కన్నా అపులే ఎక్కువగా పెరిగిపోయాయి అని మరోసారి జగన్ మండిపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తానే స్వయంగా కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ జగన్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025-26 వార్షిక ఏడాదికి సంబంధించి తొలి ఆరు నెలల్లో కేవలం 7.03% మాత్రమే పన్ను ఆదాయం వృద్ధి చెందింది అని వెల్లడించారు. ఎక్కడా కూడా ఆదాయం పెరగలేదని కోడం ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మూలధన పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయని తారాస్థాయిలో విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే అభివృద్ధి కన్నా అప్పుల్లోనే రాష్ట్రం దూసుకుపోతుంది అని కొట్టడం ప్రభుత్వం పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు ఆదాయం తగ్గిపోవడం మరోవైపు అప్పులు పెరగడం పోయి జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధిని పూర్తిగా దెబ్బతీశారు అని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదికగా తక్కువ ఆదాయం వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి.. వీటితోపాటు భారీగా పెరిగిపోతున్న రుణభారం వంటి అంశాలపై జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read also : VIRAL VIDEO: లవర్‌తో బ్రేకప్.. AIని పెళ్లాడిన మహిళ
Read also : గ్రామ పంచాయతీ నిధుల వివరాలను తెలుసుకోండిలా..





