
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యావని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మునుగోడు మండల సమితి,సీపీఐ ల ఆధ్వర్యములో యూరియా సరఫరా పెంచి కొరతను నివారించాలనీ కోరుతూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు మండల కేంద్రములో…రైతు సంఘం ఆధ్వర్యములో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అనంతరం బారి ర్యాలీతో తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపి ఇంచార్జీ తహశీల్దార్ నరేష్ కు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటామని,జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ల దృష్టికి తీసుకెళ్తామని ఇంచార్జీ తహశీల్దార్ నరేష్ తెలిపారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం పాల్గొని మాట్లాడారు.
Read also : 15 కి. మీ మేరా ట్రాఫిక్ జామ్.. NH-44 పై నిలిచిపోయిన భారీ వాహనాలు!
షరతులు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సంఘం ఆధ్వర్యములో విజ్ఞప్తి చేశారు. రైతాంగాన్ని కాపాడాలని ,కేంద్రప్రభుత్వంను డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, రైతాంగాని కాపాడాలని కోరారు. దేశానికి రైతన్న వెన్నుముక్క లాంటి వారని… వారిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఫ్ జిల్లా కార్యదర్శి తీర్పాటి వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలుగురి నరసింహ,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,మాజీ సర్పంచ్ సురిగీ చలపతి, బండమీది యాదయ్య,మందుల పాండు,మాజీ జడ్పీటీసీ గొసుకొండ లింగయ్య, ఈదులకంటి కైలాస్,బెల్లం శివయ్య,దుబ్బ వెంకన్న,అయితగోని లింగస్వామి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read also: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయండి.. లేదంటే నష్టమే?