
-
రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
-
రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారికి బీజేపీ ప్రమోషన్లు
-
ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదన్న భట్టి
-
తనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్న రాంచంద్రరావు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు లీగల్ నోటీసులు పంపారు. హెచ్‌సీయూ స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ భట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో రాంచంద్రరావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ సర్కార్ ప్రమోషన్లు ఇస్తోందని… ఆదివాసీల పట్ల భారతీయ జనతాపార్టీకి గౌరవం లేదని భట్టి వ్యాఖ్యానించారు.
భట్టి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవిగా భావిస్తూ, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ రాంచంద్రరావు నోటీసులు పంపారు. భట్టి తన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాంచంద్రరావు హెచ్చరించారు. అయితే, రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత… భట్టి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాంచంద్రరావు. దళిత సమాజాన్ని వాడుకునేందుకే ఇలాంటి అసమంజసపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి