
సంస్థాన్ నారాయణపురం, క్రైమ్ మిర్రర్:- ఓవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ బడులలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి నగదు బహుమతులు, జ్ఞాపికలు అందిస్తూనే… మరోవైపు రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఇప్పటికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయనే అంశాలపై తన వ్యక్తిగత ఇంజనీర్ల బృందం తో పరిశీలన చేయించి నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదిక ప్రకారము విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తన సొంత నిధులతో అదనపు తరగతి గదులు, నూతన బాత్రూంలు టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ తోపాటు ప్లే గ్రౌండ్ క్లియరెన్స్ లాంటి పనులకు శ్రీకారం చుట్టారు.
Read also : గుట్టల బేగంపేట్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ లడ్డు వేలం పాట విజేతలు
అందులో భాగంగానే వీలైనప్పుడల్లా ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల మరియు వసతి గృహాలను సందర్శించి విద్యార్థిని విద్యార్థులు ఎదురుకొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానిక నాయకులతో పాఠశాల అభివృద్ధి కమిటీలు వేస్తూ అభివృద్ధి పనులను చేయిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని మోడల్ స్కూల్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థినులను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్థానిక నాయకులతో వసతి గృహ పాఠశాల అభివృద్ధి కమిటీ వేసి సమస్యల పరిష్కారం కోసం పని ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని క్రమశిక్షణతో చదువుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ప్రతివారం సి బి పి టెస్టులు నిర్వహించాలని, జ్వరాల పారిన పాడిన విద్యార్థినులకు ఇక్కడే మెరుగైన చికిత్స అందించి నయం అయిన తర్వాతే వారి ఇంటికి పంపించాలని సూచించారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు సరిపడా అదనపు తరగతి గదులు, బాత్రూంలు, టాయిలెట్స్, దోమలు రాకుండా మెష్ లాంటివాటి తోపాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు మండలానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read also : మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి