
క్రైమ్ మిర్రర్, సినిమా: రాజమౌళి, మహేష్ బాబు గ్లోబ్‌ట్రాటర్ మూవీతో అభిమానులకు మళ్లీ పెద్ద సర్‌ప్రైజ్ అందించారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన ‘కుంభ’ విలన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత, తాజాగా ప్రియాంకా చోప్రా అందమైన ‘మందాకిని’ పాత్రతో ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ప్రియాంకా చోప్రా మందాకినిగా
ఈ శనివారం (నవంబర్ 15) బిగ్ రివీల్ కోసం మహేష్ బాబు మూవీ టీమ్ సిద్ధమవుతుండగా, ఫస్ట్ లుక్ రాజమౌళి, మొత్తం టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజమౌళి ట్వీట్‌లో “గ్లోబల్ స్టేజ్‌లో ఇండియన్ సినిమా అర్థాన్ని మార్చిన మహిళ.. వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్.. ప్రియాంకా చోప్రా. మందాకిని లెక్కలేనన్ని షేడ్స్‌లో చూడాలన్న ఉత్కంఠతో ఉన్నాను” అని పేర్కొన్నారు.
అలాగే, ప్రియాంకా చోప్రా తన ఫస్ట్ లుక్ ట్వీట్ చేస్తూ “ఆమె కంటికి కనిపించేదానికంటే ఎక్కువ.. మందాకినికి హలో చెప్పండి” అని తెలిపారు. మహేష్ బాబు కూడా ట్వీట్ చేసి, “మొత్తానికి ఆమె వచ్చేసింది.. మందాకినిని కలవండి” అని అభిమానులను ఆహ్వానించారు.
గ్లోబ్‌ట్రాటర్ సెన్సేషన్
రాజమౌళి తన సినిమాల ప్రమోషన్‌లో ప్రత్యేకమైన శైలిని పాటిస్తూ, అభిమానుల సస్పెన్స్‌ను నిలిపి ఉంచుతారు. ఈ గ్లోబ్‌ట్రాటర్ విషయంలో కూడా అదే కొనసాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల ఎల్ఈడీ తెరపై బిగ్ రివీల్ ఈ శనివారం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకులు వీక్షించవచ్చు.
గ్లోబ్‌ట్రాటర్ నుంచి కుంభ విలన్ ఫస్ట్ లుక్, ‘సంచారి’ సాంగ్ ఇప్పటికే విడుదలై, అభిమానులను ఫిదా చేసాయి. ఇప్పుడు ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రతో పరిపూర్ణ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మహేష్ బాబు పాత్ర పేరు, లుక్, ఫీచర్ ఏంటా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: చరిత్రలో అత్యధిక కాలం జీవించిన 10 మంది వ్యక్తులు వీరే..





