
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సరైన హిట్ లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు ఒక్క సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవలేదు. దీంతో అఖిల్ ఈసారి కొంచెం లేట్ అయిన పర్లేదు కానీ మంచి బ్లాక్ బస్టర్ సినిమాతో ముందుకు రావాలనే ఆలోచనతో ఉన్నారు. చివరిసారిగా అఖిల్ చేసినటువంటి ఏజెంట్ సినిమా దారుణంగా రిజాస్టర్ అయ్యింది. దీంతో అఖిల్ తన తరువాతి ప్రాజెక్ట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ లెనిన్. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మురళి కిషోర్ కిరణ్ అబ్బవరం తోటి వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమాను తీశారు. అయితే మొదట ఈ సినిమాకు శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తుంది అని టాక్ రాగా.. తాజాగా తను పక్కకు తప్పుకుందని సమాచారం. శ్రీ లీలా ప్లేసులో రవితేజ తో నటించినటువంటి కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ నటించబోతుందని సినిమా వర్గాల్లో చర్చ నడుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ కొత్త హీరోయిన్ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. మరి అఖిల్ కెరీర్లు ఈ సినిమా ఒక హిట్టుగా నిలుస్తుందా లేదా అని సినిమా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అఖిల్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
Read also : మోడీ శ్రీశైలం పర్యటన.. భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన అధికారులు!
Read also : నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు : రాజగోపాల్ రెడ్డి