
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాలోని నటిస్తూ తనదైన నటనతో, అందంతో, డ్యాన్సులతో ప్రతి ఒక్కరిని కూడా మైమరిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీలకు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్లపై ట్రోలింగ్స్ అనేవి ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైపోయాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ లీలకు ట్రోల్స్ పై ఒక ప్రశ్న ఎదురయింది. ఇంటర్వ్యూ చేసే అతను మీపై వచ్చే ట్రోల్స్ పై మీరు ఎలా స్పందిస్తారు అని అడగగా.. శ్రీ లీలా చాలా మెచ్యూర్ గా దిమ్మతిరిగే కౌంటర్లు వేశారు.
Read also : ఎడతెరిపిలేని భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ జగన్
సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి ట్రోలింగ్ ను చూడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారు ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు అని కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు నేను కూడా అందరికీ నచ్చాల్సిన పనిలేదు అని సమాధానం ఇచ్చారు. అనవసరంగా వాటిని పట్టించుకోని బాధపడడం కన్నా … నన్ను ప్రేమించే వారిని ఇంకా ప్రేమించుకునేలా చేయడం మంచిది కదా అని అన్నారు. క్రీడలు అంటే నాకు చాలా బాగా ఇష్టమని… ఒకానొక దశలో నేను స్టేట్ లెవెల్ హాకీ ప్లేయర్ గా కూడా ఆడుకుంటూ వచ్చాను అని కీలక విషయాలను చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అలాగే బాలీవుడ్ కు పెద్దగా తేడా ఏమీ నాకు కనిపించడం లేదు అని స్పష్టం చేశారు. సాధారణంగా భాషల్లో తేడా ఉండవచ్చు కానీ ఎమోషన్ మాత్రం ఒకేలా ఉంటుంది అని చెప్పకు వచ్చారు.
Read also : తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్





