ముగిసిన శ్రీభవాని రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-మండలంలోని వట్టిపల్లి గ్రామంలో వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం, ఏకశిలపై కొలువైన శ్రీభవాని రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు, బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. గత మూడు రోజులుగా భక్తజన సందోహం నడుమ, ఆధ్యాత్మిక శోభతో జరిగిన ఈ వేడుకలు, సర్పంచ్ శిరసవాడ బిక్షమయ్య పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ​జాతర ముగింపు పర్వంలో భాగంగా, బుధవారం సాయంత్రం ఒక ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. ఏకశిల గుట్టపై కొలువై ఉన్న శివపార్వతుల విగ్రహాలను భక్తి శ్రద్ధలతో కిందికి దింపారు. శివనామ స్మరణల మధ్య విగ్రహాలను దింపి, సురక్షితంగా భద్రపరిచారు. ​ఉత్సవాలు విజయవంతం కావడంలో గ్రామ కమిటీ, స్థానిక నాయకులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, నాయకులు ​నీల యాదయ్య, ​చెన్నయ్య శిరసవాడ రాంబాబు, మామిడి కమలాకర్ పాల్గొన్నారు.

Read also : మర్రిగూడ: ఇరుకు రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

Read also : Abhishek Sharma: కొత్త గెటప్‌లో కనిపించిన భారత స్టార్ ఓపెనర్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button