క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ సీజన్ 19 లో భాగంగా ఈరోజు కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఒకవైపు కోల్కత్తా ముంబై జట్టుపై ఓడిపోయి బరిలోకి దిగబోతుంది. మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా బెంగళూరు పై ఓడిపోయి.. ఓటమితో ఈరోజు ఈ రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. గత సీజన్లో కోల్‌కతా మరియు హైదరాబాద్ జట్లు మంచి ప్రదర్శన కనపరిచాయి. దీంతో ఎలాగైనా సరే ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ లో కచ్చితంగా గెలిచి బోణి కొట్టాలని రెండు జట్లు కూడా కసిగా ఉన్నాయి. కాగా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ రెండు టీంలు 30 సార్లు తలపడగా కోల్‌కతా 20 సార్లు విజయం సాధించింది. దీంతో ఈరోజు కూడా కోల్‌కత్తాకు కాస్త ఫేవరెట్ గా మారగా.. కానీ అవతల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ మాత్రం కూడా తడబడకుండా ఏకంగా 250 కి పైగా స్కోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. బ్యాటింగ్ లో ఇరుజట్లు చాలా బలంగా కనిపిస్తున్న బౌలింగ్‌లో మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇరుజట్లు కూడా భారీ స్కోరులను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు జరగబోయేటువంటి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ జిల్లాలకు వడగాలులు ఎఫెక్ట్.. జర జాగ్రత్త!
ఆరోజు ‘అన్న’ మాటలు ఎప్పటికీ మర్చిపోను : నిహారిక
