అంతర్జాతీయం

అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా..మరోకరు పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్‌ హెల్త్‌కేర్‌ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్‌ యూనియన్‌లో యాక్టివ్‌ షూటర్‌ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్‌ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.

కాల్పుల ఘటనతో ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలో జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button