
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్:-మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి కొత్త అదనపు భవన నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తిచేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ లలిత త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ పనుల పురోగతిని సోమవారం ఆమె మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి మంజూరైన 160 కెవీ జనరేటర్‌ను నెల రోజుల లోపు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి పడకల సంఖ్య 100 నుండి 200కు పెరగడం నేపథ్యంలో మంజూరైన ఏడుగురు అదనపు సానిటేషన్ సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని సూచించారు.ఆసుపత్రిలో డాక్టర్లు,సిబ్బంది, ఓపీ రిజిస్టర్లు, రోగుల రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్, డయాలసిస్, సర్జరీ సేవల నిర్వహణపై డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. నూతన భవన నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న రూ.4.5 కోట్ల బిల్లులు త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన వివరాలను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.ఆసుపత్రిలో అత్యవసర సేవలకు కాజువాల్టీ విభాగంలో ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Read also : అప్పుల బాధతో ముగ్గురు కూతుర్లను గొంతు కోసి చంపిన తండ్రి!. ఆ తరువాత?
ఆసుపత్రి ప్రగతిపై వివరాలు ఇచ్చిన డాక్టర్ మాతృనాయక్
జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్ మాట్లాడుతూ..గత నెలలో మిర్యాలగూడ ఆసుపత్రిలో 250 సర్జరీలు, 20 మేజర్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మోకాలి, హిప్ మార్పిడి సర్జరీలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఆసుపత్రి లక్ష్య పథకం కోసం ఎంపికైందని చెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సమరద్, తహసీల్దార్ ఎస్. సురేష్ కుమార్, డాక్టర్లు మాధవ్ కుమార్, జగేందర్ పాల్గొన్నారు.
Read also : చనిపోయిన మహిళ అకౌంట్లో లక్ష కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చినట్లు?