తెలంగాణ

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా

నల్లగొండ(క్రైమ్ మిర్రర్):-రానున్న ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వారిపై, నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఎవరైనా సామాజిక మాధ్యమాలలో వాట్స్అప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మొదలగు వాటిని వేదికగా చేసుకుని, ఇతర కులాల పట్ల, మతాల పట్ల, వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు, విద్వేష పూరితమైన పొస్ట్ లు, ద్వేష పూరిత ప్రసంగాలు, రెచ్చ గొట్టే విధంగా పోస్ట్ లు,అసత్య ప్రచారాలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో తప్పుడు పోస్టులు పెడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని ఈ సందర్బంగా ఆయన సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసినా, షేర్ చేసినా, వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కి తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

వర్కాల సూర్యనారాయణకు ఉగాది పురస్కార అవార్డు

కేటీఆర్ పాదయాత్ర… ఆంధ్రావాలా బాటలో నడుస్తున్నాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button