
Meghastar Chiru : ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారుండరు. ఐతే మెగాస్టార్ కి ఫ్యాన్స్ ఉంటారని అనడం కంటే భక్తులు ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు.. రాజకీయాల్లో, ప్రజా సేవలో ఎన్నో మంచి పనులు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను స్థలించి ఎంతోమందికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు.
ఐతే మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, తెలుగు పీఆర్ సురేష్ కొండేటి రీసెంట్ గా “వీరాభిమాని” అనే సినిమాని తీశాడు. ఈ సినిమాలో సురేష్ కొండేటి హీరోగా నటించాడు. ఈ సినిమాని మెగాస్టార్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న హైదరాబాద్ లోని 70 థియేటర్స్ లో ఫ్రీ షోలు ప్రదర్శించనున్నారు . ఈ విషయం గురించి సురేష్ కొండేటి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇందులో భాగంగా ఆగస్ట్ 22న వీరాభిమాని సినిమాని చూసి ఆదరించాలని మెగాస్టార్ అభిమానులని కోరాడు.
https://x.com/santoshamsuresh/status/1958199028430307553?t=J1MKuhhJjFb0bWqcOBKwIw&s=08
ఐతే ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించాడు. ఎప్పుడు కాంట్రవర్సీ ప్రశ్నలతో ఇంటర్వ్యూలలో అలరించే సురేష్ కొండేటి వీరాభిమాని సినిమాలో మెగాస్టార్ ఫ్యాన్ గా నటించి అలరించే ప్రయత్నం చేశాడు. మరి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.