
-
రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు
-
జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ విషయంలో లంచం డిమాండ్
క్రైమ్ మిర్రర్, సంగారెడ్డి: జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసిన ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15వేలు లంచం తీసుకుంటూ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య పట్టుబడ్డారు. ఫైల్ ప్రాసెస్ చేసి, రూ.52,87,500 చెక్కును దరఖాస్తుదారుడికి ఇచ్చేందుకు రూ.50వేలు డిమాండ్ చేశారు.
దీనికి అదనంగా మళ్లీ రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హుస్సేల్లి గ్రామంలో మూడు ఎకరాల 21 గుంటల భూమిని జహీరాబాద్‌లోని నిమ్జ్ స్వాధీనం చేసుకున్నందుకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేసినందుకు లంచం డిమాండ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.