
SP Charath Chandra Pawar Crime Meeting: రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని పోలీసు అధికారును నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో క్రైమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన.. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు.
నిందితులకు శిక్షపడేలా చేయాలి!
ఈ సమావేశంలో కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న చర్యల గురించి పోలీసుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎస్పీ పవార్. నేరాలను అదుపు చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. NDPS చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటూ, నిందితులకు శిక్ష పడే విధంగా పని చేయాలన్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్థులపై నిఘా పెంచాలన్నారు. సైబర్ నేరాలపై యువతీ యువకులలో అవగాహన కల్పించాలన్న ఆయన, ఆన్ లైన్ బెట్టింగ్, లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి యువకులకు చెప్పాలన్నారు. గంజాయి, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పి శివ రాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, డిసిఆర్బి డిఎస్పీ రవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Read Also: అత్తింటి వేధింపులు అబద్దమేనా? మహిళా ఐపీఎస్ పై సుప్రీ ఆగ్రహం!