నల్లగొండ నిఘా,(క్రైమ్ మిర్రర్):- మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా, కొండమల్లెపల్లి మండలం కోల్ముంతల్ పహాడ్ తండాలోని, సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, నామినేషన్ ప్రక్రియ భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకొని, నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తునట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి, ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని, నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు.
అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలని పాటించాలని, ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బిసిఐ రాము, కొండమల్లపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్, సిబ్బంది తదితరులున్నారు.





