Homeతెలంగాణప‌రీక్ష‌కేంద్రాల‌ను ప‌రిశీలించిన ఎస్పీ డి. జాన‌కి

ప‌రీక్ష‌కేంద్రాల‌ను ప‌రిశీలించిన ఎస్పీ డి. జాన‌కి

  • ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు జ‌రిగేలా చూడాలి

మహబూబ్‌న‌గ‌ర్ ,క్రైమ్ మిర్ర‌ర్: జిల్లాలో జ‌రుగుతున్న ప‌రీక్ష‌కేంద్రాల‌ను గురువారం జిల్లా ఎస్పీ డి. జాన‌కి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌టౌన్‌లోని ప్ర‌భుత్వ బాలుర క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన ప‌రీక్ష కేంద్రాన్ని సంద‌ర్శించి అక్క‌డ ఉన్న‌టువంటి పోలీసు బందోబ‌స్తు, భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప‌రీక్షలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం, పార‌ద‌ర్శ‌కంగా, ఎలాంటి సంఘ‌ట‌న‌లు లేకుండా ప‌రీక్ష‌లు జ‌రిగేలా ప‌టిష్టమైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పరీక్ష కేంద్ర పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంద‌ని తెలిపారు.

మొబైల్‌ఫోన్‌లు,ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల వినియోగం క‌ఠిన నిబంద‌న‌లు పాటించేలా ప‌ర్య‌వేక్షించాల‌ని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సహకరించాలని తెలిపారు. . ఈ కార్యక్రమంలో సంబంధిత సర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్‌, స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు