
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి:-
నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ పై అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డుల పరిశీలన, రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాక్‌అప్, ఎస్‌హెచ్‌ఓ కార్యాలయం వరకు విస్తృతంగా తనిఖీలు జరిపారు.
“ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు”
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ పవార్ మాట్లాడుతూ,పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి,వారి ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించి సత్వర న్యాయం చేయడం ప్రధాన బాధ్యత అని సిబ్బందికి వివరంగా సూచనలు ఇచ్చారు.
సీసీటీవీ, సైబర్ అవగాహనకు ప్రత్యేక దృష్టి
గ్రామాల్లో నేరాల నిరోధక చర్యల్లో భాగంగా సీసీటీవీ అమరికల అవసరాన్ని ప్రజలకు వివరించాలి,సైబర్ క్రైమ్, డయల్ 100 వంటివి ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించాలి అని సూచించారు.పట్టణాల్లో మద్యం, గంజాయి పై గట్టి చర్యలు,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,గంజాయి, జూదం, అక్రమ ఇసుక, పీడీఎస్ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ప్రతి రోజు నిర్వహించి, రోడ్డు ప్రమాదాలు తక్కువ చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
“విజిబుల్ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి”
పాత నేరస్థుల కదలికలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచి, పెట్రోలింగ్‌ని ముమ్మరం చేయడం ద్వారా ప్రజలకు భద్రతా భావం కల్పించాలి అని అన్నారు. ప్రతి పోలీస్ మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలంటూ స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో కొండమల్లెపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.